‘కొండను తవ్వి ఎలుకను పట్టిన’ చందంగా తయారయ్యాయి పార్లమెంటు వర్షాకాలం సమావేశాలు. ప్రజా సమస్యల్ని చర్చించడానికి ఉపయోగపడాల్సిన సభలు కాస్త రాజకీయ వేదికలుగా మారాయి.
గత పది రోజులుగా పార్లమెంటు సవ్యంగా సాగడం లేదు. బొగ్గు కుంభకోణానికి సంబంధించి ప్రధాని రాజీనామా చేయాలనే డిమాండుతో బీజేపీ సభను అడుగడుగునా అడ్డుకుంటోంది.
మొన్నటి వరకు అమ్మ పలికింది. అనుగ్రహించింది. మా కోర్కెను మన్నించింది. తెలంగాణ ఇస్తాననీ చెప్పింది. తెలంగాణ తెచ్చేది మేమే అంటూ మేకపోతు గాంభీరాలు పలికిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ముఖాలలో రక్తం లేకుండా పోయింది.
ఈ నెల 8నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతుండగా, 22నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీని కోసం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు.