ఓట్ల లెక్కింపు ప్రారంభమైన మొదటి రౌండ్ నుంచీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తమ ఆధిక్యతను చాటుకుంటున్నారు. తొలుత తిరుపతిలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డితో ప్రారంభమైన ఈ ఆధిక్యత మిగతా అన్ని స్థానాలలో కనబర్చింది. తొలుత వందల్లో ఆధిక్యతలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు రెండో రౌండ్, మూడో రౌండ్ కు వచ్చే సరికి వారి ఆధిక్యత వేలలోకి వెళ్లింది.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/336/
అందరూ ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న ఆ రోజు రానే వచ్చింది. నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఓట్ల లెక్కింపు మరి కొన్ని నిమిషాల్లో ప్రారంభం కాబోతోంది. గంటల్లోనే ఫలితాలు తెలుస్తాయి. అభ్యర్థుల జాతకం తేలిపోనున్నది. శుక్రవారం ఉదయం 8గంటల నుంచి లెక్కింపు ప్రారంభమవుతోంది. దీని కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను చేసింది. కౌంటింగ్ కు కౌంట్ డౌన్ ప్రారంభం కాబోతుండటంతో అన్ని పార్టీలలో భయం పుంజుకుంది. గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్న మరి కొంత సేపట్లో తమ భవిష్యత్ తేలిపోతుండటంతో అందరిలో ఏదో తెలియని టెన్షన్.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/333/