పరకాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైకాపా పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, ఆమె కూతురు షర్మిల పర్యటన ఖరారైంది. ఈ నెల 8,9తేదీలలో వాళ్లిద్దరూ పరకాలలో పర్యటించనున్నారు. వారి పర్యటనకు పార్టీ శ్రేణులు సర్వం సిద్ధం చేశాయి. అయితే, ఈ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో అడుగుపెట్టే ముందు వైకాపా పార్టీ నేతలు తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పి రావల్సిందిగా తెలంగాణ జేఏసీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు హెచ్చరిస్తున్నారు. అటు రాజకీయ జేఏసీ, ఇటు టీఆర్ఎస్ ఇరువురు వైకాపాకు వార్నింగ్ ఇవ్వడంతో పరకాలలో వైకాపా పార్టీ నేతల ప్రచారం ఎలా సాగుతుందనే దానిపై అందరిలోనూ టెన్షన్ మొదలైంది.
http://www.apherald.com/Politics/ViewArticle/131/వ
http://www.apherald.com/Politics/ViewArticle/131/వ
No comments:
Post a Comment