Sunday, July 8, 2012

వన్నే తగ్గినా నేనే హీరో

అధినాయకుడు సినిమాతో బాలయ్యబాబుకు వయస్సు కు తగ్గ పాత్రలు ఎంపిక చేసుకోవాలని సందేశం ఇచ్చినట్టు ఉంది. ముఖంలో మార్పులు స్పష్టం గా కనిపిస్తూన్నాయి. అందమైన పడుచు హీరోయిన్ తో స్టెప్ లు కాకుండ తన వయస్సుకు తగ్గ పాత్రలు బాలయ్య కధానాయికలతో నటించాలసిన సమయం వచ్చింది. ఎన్ టీఆర్ 40 ఎళ్లు పాట్టు హీరోగా ఏ పాత్ర వేసినా నీరాజనం పట్టారు. తండ్రిలా బాలయ్య కూడా చేయాలసిన చాల పాత్రలు మిగిలి ఉన్నాయి. హీరో అంటే నాలుగు పాటలు , 8పైట్స్, లేకుంటే విలన్ ను,వారి అనుచరులను నరికి చంపడం కాదు. బడి పంతులు, రక్తసంబంధం వంటి ఎన్నో పాత్రలుచేయాలసినవి ఉన్నాయి పౌరాణీకాలపై పట్టు ఉన్న బాలయ్య పౌరా ణీక పాత్రలు ఏంపిక చేసుకుని,తండ్రి తారక రామారావులా ఈ పాత్రలు బాలయ్య తప్ప ఎవరుచేయలేరు అన్న విధంగా కీర్తీ గడించాలి. ఇప్పటికైనా యువ పాత్రలు యువకులకు వదిలి సహభాష్ బాలయ్య అని పించుకోవాలి.
http://www.apherald.com/Movies/ViewArticle/147

No comments:

Post a Comment