రాష్ర్ట వ్యాప్తంగా సంచలన రేపిన మద్యం సిండికేటు కేసును ప్రభుత్వం మూసివేసినట్లు తెలుస్తోంది. ఎంతోమంది మద్యం వ్యాపారుల, రాజకీయ నాయకుల, మంత్రుల గుండెల్లో గుబులు పుట్టించిన ఈ కేసును మూసి వేసేందుకు ప్రభుత్వం మొగ్గు చూపెట్టినట్లు సమాచారం. అనేక ఒత్తిళ్లకు లొంగిన సర్కార్ చివరకు ఈ దిశగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఫలితంగా అనేక మంది ఏసీబీ అధికారుల ముఖ్యంగా అప్పట్లో ఈకేసును ప్రత్యేకంగా పరిశోధన చేసిన ఐపీఎస్ అధికారి శ్రీనివాస్ రెడ్డి పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారిందనే చెప్పాలి. మద్యం కేసులో రాష్ర్ట మంత్రి బొత్స సత్యనారాయణకు సంబంధాలున్నట్లు ఏసీబీ అధికారులు నిగ్గును తేల్చారు.
Read complete article here @ http://www.apherald.com/Politics/ViewArticle/138/
Read complete article here @ http://www.apherald.com/Politics/ViewArticle/138/
No comments:
Post a Comment